ఎంపీల‌తో వైఎస్ జ‌గ‌న్ భేటీ..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం ఏపీ భవన్‌లో కొద్ది సేపటి క్రితం ప్రారంభం అయ్యింది. ఈ నెల 17 నుంచి ప‍్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.ప్ర‌త్యేక హోదా, రాష్ట్ర ప్ర‌యేజ‌నాల‌పై పోరాడాలిని ఎంపీల‌కు సూచించిన‌ట్లు స‌మాచారం.

రాష్ట్ర సమస్యల పరిష్కారమే అజెండాగా సభలోవాణి వినిపించాలని ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సమస్యలను సామరస్యపూర్వకంగా కేంద్రం దృష్టికి ఎలా తీసుకెళ్లాలన్నదానిపై చర్చిస్తున్నారు. లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డితో పాటు పార్టీ ఎంపీలంతా సమావేశానికి హాజరయ్యారు