- Advertisement -
ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కాసేపట్లో వైద్యులు హెల్త్ బిలెన్‌ను విడుదల చేయనున్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు , సీనియర్ నాయకులు వాజ్‌పేయిన పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్ది సేపటి క్రితం ఆసుపత్రికి చేరుకున్నారు. వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ వెంట పార్టీ నేతలు ఉన్నారు.