ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. యూపీలోని కీలక స్థానాలు రాయ్ బరేలి, అమేథి నుండి పోటీ చేసే పేర్లను ప్రకటించింది కాంగ్రెస్. నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కావడంతో లాస్ట్ వరకు సస్పెన్స్‌లో ఉంచి పేర్లను ప్రకటించారు. గత ఎన్నికల్లో అమేథి నుండి రాహుల్ గాంధీ పోటీ చేయగా ఈసారి మాత్రం రాయ్‌బరేలి నుండి పోటీ చేస్తున్నారు. అలాగే అమేథి నుండి కిషోర్ లాల్ శర్మ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్.
రాయ్‌బరేలిలో రాహుల్ పై బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో సోనియా గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు దినేష్. ఈసారి ఆయనకే టికెట్ ఇచ్చింది బీజేపీ. సోనియాపై ఇప్పటి వరకు పోటీచేసిన అభ్యర్థులందరిలో దినేశ్ ప్రతాప్ సింగ్ కే అత్యధిక ఓట్లు వచ్చాయి.
ఇక రాహుల్ ఈసారి కూడా కేరళలోని వాయనాడ్ నియోజకవర్గంతో పాటు రాయ్ బరేలి నుండి పోటీ చేస్తున్నారు. అమేథీలో బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోసారి పోటీ చేస్తున్నారు.