కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీతో నేతన శకం ప్రారంభమయ్యింది. కాంగ్రెస్ కార్యకర్లు, నాయులు, అభిమానులు అందరూ ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. పార్టీ 49వ అధ్యక్షుడిగా రాహుల్ పగ్గాలు చేపట్టారు. ఏఐసీసీ కార్యాలయంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన లాంభచనంగా పార్టీ పగ్గాలు స్వీకరించారు. 19 ఏళ్ల పాటు అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించిన సోనియా గాంధీ ఆ పదవి నుంచి వైదొలిగారు.
రాహుల్ పట్టాభిషేకం కార్యక్రమలో పార్టీ పూర్వ అధ్యక్షురాలు, తల్లి సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, సోదరి ప్రియాంకగాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీకి అతిరథ మహరథులు, సీనియర్ నేతలు హాజరయ్యారు. పార్టీ 60వ అధ్యక్షుడిగా రాహుల్ పగ్గాలు చేపడుతుండటంతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది.
సోనియాగాంధీ చేతుల్లో ఉన్న పార్టీ పగ్గాలు రాహుల్ చేపట్టారు. దీంతో 19 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చారు. లాంఛనంగా ఇటీవల జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతలు రాహుల్‌ను అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ సంతకాలు చేశారు. ఈ వేడుక సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయమంతా పండుగ వాతావరణం నెలకొంది.