గత ఏడాది మార్చి నుంచి దేశంలో కరోనా ప్రభావం విపరీతంగా పెరగడం మొదలైంది. ఎక్కడ చూసినా పాజిటీవ్ కేసులు.. మరణాల సంఖ్య కూడా పెరిగింది. దాంతో లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. ఆనాటి నుంచి జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. దేశంలో కరోనా కాస్త కంట్రోల్ కి వచ్చంది.. దాంతో లాక్ డౌన్ ఎత్తి వేశారు.
ఆనాటి నుంచి ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. మళ్లీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. దాంతో కొన్ని రాష్ట్రాల్లో కేసులు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి.
తెలంగాణ లో కరోనా తగ్గినట్లే తగ్గి… మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా మరో 278 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 35 మంది మహమ్మారి బారిన పడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 3,02,047కి పెరిగింది.వైరస్‌కు మరో ముగ్గురు బలయ్యారు. ఇప్పటివరకు 1,662 మంది మహమ్మారితో మరణించారు. తాజాగా 111 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు.
ఇప్పటివరకు 298,120 మంది కొవిడ్‌ను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,265 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 830 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.