ఏపీని వణికిస్తున్న పెథాయ్ తుపాన్ పశ్చిమ గోదావరి వద్ద తీరాన్ని తాకింది. పెథాయ్ తుపాన్ కారణంగా ఏపీలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది. . తుపాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడలో కొండచరియలు విరిగిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. పెథాయ్ తుపాన్ ప్రభావంతో వీస్తున్న చలిగాలులకు తట్టుకోలేక తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు మృతి చెందారు.తుపాన్ ప్రభావంతో చలిగాలుల తట్టుకోలేక పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు వృద్దులు ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
పెథాయ్ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఇవి ఒక దశలో 110 కిలోమీటర్ల స్థాయికి కూడా చేరుకుంటాయని ఐఎండీ ప్రకటించింది. సముద్రంలో అలలు 6 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది.తుపాన్ కారణంగా చాలా ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా, తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తుపాన్ తీవ్రత ఎక్కువుగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!