Thursday, May 8, 2025
- Advertisement -

అవిశ్వాసానికి ముహూర్తం ఖరారు

- Advertisement -

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి తేదీ ఖరారైంది. ఈనెల 14న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్‌ కోడెల.. వైసీపీకి అనుమతించారు. తమకు తగినంత సంఖ్యాబలం లేకున్నా.. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు అవిశ్వాస తీర్మానాన్ని ఉపయోగించుకోవాలని వైసీపీ అధినేత భావిస్తున్నారు. అందులోనూ పార్టీని వీడి వెళ్లిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలన్న వ్యూహమూ దీని వెనుక ఉందని అంటున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ రూల్స్ లోని  75వ నిబంధన ప్రకారం.. అవిశ్వాస తీర్మానం నోటీసును అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు…. దీనిపై 15మంది వైఎస్సార్‌ కాంగ్రెస్ MLAలు సంతకాలు చేశారు.. ఈ నోటీసు అందుకున్న స్పీకర్‌… ఈ నెల 14న ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు  అనుమతించారు. 

రాజధాని భూముల్లోకూడా భారీగా అవినీతి జరిగిందని, ఈ భూముల అక్రమాల్లో సీఎం చంద్రబాబు కుటుంబంతోపాటు… మంత్రులు, ఎమ్మెల్యేలు భాగస్వాములుగా ఉన్నారని వైసీపీ విమర్శిస్తోంది. ప్రభుత్వ తీరును బట్టబయలు చేసేందుకే అవిశ్వాసం తీర్మానం పెట్టామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు..

ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలని వైసీపీ వ్యూహ రచన చేస్తోంది.. అవిశ్వాసంపై ఓటింగ్‌కు ముందు పార్టీ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.. ఒకవేళ విప్‌ను ధిక్కరిస్తే వారిపై అనర్హత వేటు పడుతుందని హెచ్చరిస్తోంది..

అయితే ఈ అవిశ్వాస తీర్మానంపై టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు ఏం చేస్తారో.. వారిని అధికార పక్షం ఎలా కాపాడుకుంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -