Saturday, May 4, 2024
- Advertisement -

పవన్ కొడుకుపై కామెంట్ చేసినందుకు వర్మకి కౌంటర్ ఇచ్చిన వర్మ కూతురు

- Advertisement -

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఒక వైపు రాజకీయాల్లో.. మరో వైపు సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం పవన్ కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. అయితే పవన్ కొడుకుకి ‘మార్క్ శంకర్ పవనోవిచ్’ అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.

ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఆర్జీవీ ఫెస్ బుక్ లో చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం చాలా వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా రామ్ గోపాల్ వర్మ కూతురు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కావడంతో వర్మ పెట్టిన మెస్సేజ్ కి కౌంటర్ ఇచ్చారట. ఈ సంగత్తిని వర్మనే క్లియర్ గా చెప్పాడు. పవన్ కొడుకు పేరు వెనుక అసలు చరిత్ర ఉందని కామెంట్ చేయగా ఆయన కూతురు రేవతి వర్మ ఈ విధంగా సమాధానాన్ని ఇచ్చారు. నువ్వు పోస్ట్ చేసిన మెస్సేజ్ లో ఒక్క ముక్క కూడా అర్ధం కావడం లేదు.

ఆ పేరుకి చరిత్రకు సంబంధం ఏంటి అంటూ.. పని లేక పనికిమాలిన పోస్ట్ లు పెడుతున్నావని కౌంటర్ వేయడంతో వర్మ కూడా తనదైన శైలిలో కూతురికి మెస్సేజ్ పెట్టాడు. అసలు నేను పెట్టిన పోస్ట్ లు నీకు అర్ధం కాలేదని.. నువ్వు పెట్టిన మేస్సేజ్ చూస్తేనే నాకు అర్ధం అవుతుందని చెబుతూ.. మీ అందరికంటే పవన్ కళ్యాణ్ ను నేను ఎక్కువగా లైక్ చేస్తానని వర్మ జవాబు ఇచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -