- Advertisement -
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం నానాటికి పెరుగుతోంది. ఢిల్లీ వెళ్లి క్రష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేస్తానంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు.
ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. క్రష్ణా రివర్ బోర్డు ఆదేశాలను తెలంగాణ సర్కార్ ధిక్కరిస్తోందని ఆయన అన్నారు. విభజన చట్టం ప్రకారమే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని మంత్రి హరీష్ రావు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.