రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి గాసిప్స్ పుడతాయో ఎవరికీ అర్థం కాదు. కొన్ని రూమర్లైతే.. ఇవి నిజమేనా అని జనాన్ని ఆలోచింపజేస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్రానికి చెడిందన్న అలాంటి వార్తే.. ఢిల్లీ నుంచి ఆంధ్రా గల్లీ వరకు చక్కర్లు కొడుతోంది.
ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలీదు కానీ.. ఓ మీడియా (ఆద్యా న్యూస్ కాదు) లో వచ్చిన వార్తే… ఈ రూమర్లకు ఆధారమవుతోంది. ఏపీతో పాటు… తెలంగాణలో టీడీపీని పటిష్టపరిచేందుకు చంద్రబాబు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. బీజేపీ అండతో.. తెలుగు దేశం నాయకులకు నామినేటెడ్ పోస్టులు, కుదిరితో ఓ గవర్నర్ పదవి కూడా ఇప్పించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు.
అయితే.. బాబు రిక్వెస్ట్ కు కేంద్రం నుంచి.. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ నుంచి ఏ మాత్రం రెస్పాన్స్ రావడం లేదన్నది ఇప్పుడు వినిపిస్తున్న రూమర్ సమ్మరీ. పదవులు కావాలంటే… కచ్చితంగా లోకల్ బీజేపీ లీడర్లతో పాటు.. ఆర్ఎస్ఎస్ సిఫారసు కూడా ఉండాలన్నది మోడీ మాటగా… తెలుస్తోంది.
చంద్రబాబుతో.. నరేంద్రమోడీ సంబంధాలు ఆహా ఓహో అనే రీతిలో ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతుంటారు. పైకి చూస్తే అది నిజమే అనేలా బాబుతో పాటు.. మోడీ కూడా వ్యవహరిస్తుంటారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం అన్నీ చేస్తోందని లెక్కలతో సహా చెబుతుంటారు. కానీ.. ఇప్పుడు వినిపిస్తున్న రూమర్ నిజమే అయితే.. ఇదంతా పైన పటారం లోన లొటారం వ్యవహారమే అనుకోవాల్సి వస్తుందని జనం అనుకుంటున్నారు.