అసంబ్లీ – ప్రజలకి మనం చేసింది ఏంటి చేయ్యబోయేది అనేది మాట్లాడి , విశ్లేషించుకునే ప్లేస్. తెలంగాణా లో ప్రతిపక్షాలని నిర్వీరియం చెయ్యాలి అన్న ప్లాన్ తెరాస కి ఫుల్లు గా వర్క్ అవుట్ అవుతోంది.మనం బలపడాలంటే ప్రత్యర్థుల్ని బలహీన పరచాలన్న సూత్రాన్ని ఆకళింపుజేసుకుని, ఫిరాయింపుల్ని అధికార పార్టీ ప్రోత్సహించి కొంతమేరకు విజయం సాధించింది. ఇప్పుడు అసెంబ్లీలో కూడా తనదైన వ్యూహాన్ని అమలు చేస్తూ… ప్రతిపక్షాలన్నింటినీ బాగానే దారిలోకి తెచ్చుకున్నారు కేసీఆర్.
పార్టీలవారీగా ఎవరిని ఎలా అదుపులో ఉంచాలో… అవసరమైనప్పుడు ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తెరాసకు బాగా తెలుసు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్. కానీ, అది పేరు మాత్రమే ప్రధాన ప్రతిపక్షం అన్నట్టుగా తీరు మారిపోయింది. కాంగ్రెస్ నేతలు ఎవరైనా అధికార పార్టీపై స్వరం కాస్త పెంచుతున్న సందర్భం వస్తోంది అనగానే కేసీఆర్ మాట్లాడటం మొదలుపెడతారు. ‘సభలో పెద్దలు జానారెడ్డి లాంటివారు ఉన్నారు. ఆయనకి అన్ని విషయాలు తెలుసు’ అనేసరికి పరిస్థితి మారిపోతుంది.
ప్రతిపక్షం తరఫున గట్టిగా మాట్లాడాల్సిన జానా చల్లబడిపోతారు. సో… కాంగ్రెస్ వీక్ పాయింట్ ను అక్కడ పట్టుకున్నారు.ఆ తరువాత, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవాలి. సభలో ముచ్చటగా ముగ్గురు మాత్రమే ఉన్నారు. వారిలో ఆర్. కృష్ణయ్య సభలో ఉంటారో ఉండరో తెలీదన్నట్టు ఉంటారు. హాజరు వేయించుకోవడానికి మాత్రమే ఆయన వస్తున్నట్టు మౌనంగా మిగిలిపోతున్నారు. ఒక్కోసారి మాట్లాడినా కూడా ఆయన సొంత అజెండా ఆయనది. మరో టీడీపీ సభ్యుడు సండ్ర గొంతు వినిపించిందే లేదు. ఇక మిగిలింది రేవంత్ రెడ్డి. ఒక్క సభ్యుడిని కంట్రోల్ చేయడం అధికార పార్టీ సభ్యులకు విషయం కానే కాదు.