Thursday, May 8, 2025
- Advertisement -

అధికారులను ఆదేశించిన తెలంగాణ సిఎం

- Advertisement -

ముందు నిర్ణయించిన విధంగా ఈ ఏడాది ఆర్దిక సంవత్సరం ముగిసేలోగా  రెండు లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదేశించారు. సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్లాలని నిర్దేశించారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జిల్లాల వారీగా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై సమీక్ష జరిపారు. ఇంతవరకూ కేవలం ఆరు వేల ఇళ్లకు సంబంధించి మాత్రమే టెండర్లు పూర్తి అయినట్లుగా అధికారులు సిఎంకు చెప్పడంతో వారిపై కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీలున్నంత త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. దీని వల్ల పనులు వేగవంతం కావడమే కాకుండా ఖర్చు కూడా తగ్గుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -