కేరళలోని కోజికోడ్‌లో ఓ వృద్ధురాలు చూపిన ధైర్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫుట్‌పాత్‌పై నడిచే పాదచారులకు ఇబ్బంది కలిగేలా ఓ స్కూటీ దూసుకెళ్తుండగా, ఆ బామ్మ ముందుకు వచ్చి వాహనాన్ని అడ్డుకుంది.
స్కూటీ నడిపిన వ్యక్తి ఎంత ప్రయత్నించినా, ఆమె వెనక్కి తగ్గకుండా ధైర్యంగా నిలబడి రోడ్డుమార్గం వైపు వెళ్లాలని గట్టిగా సూచించింది. ఫుట్‌పాత్ అనేది పాదచారుల కోసం మాత్రమేనని ఆమె స్పష్టం చేసింది. చుట్టుపక్కల ఉన్నవారు ఈ ఘటనను వీడియోగా చిత్రీకరించగా, అది సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది.
ప్రమాదాలకు దారి తీసేలా ఫుట్‌పాత్‌లపై వాహనాలు నడపడం తరచుగా కనిపించే సమస్య. అయితే ఈ వృద్ధురాలు చూపిన ధైర్యం, బాధ్యతాయుతమైన పౌరుడిగా వ్యవహరించిన తీరు అందరికీ ఆదర్శంగా నిలిచింది. వయస్సు పైబడినా సామాజిక బాధ్యతను గుర్తుచేసిన ఆమెకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
