కేంద్ర మాజీరక్షణశాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ ( 88 ఏళ్లు )తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా స్వైన్ ఫ్లూతోబాధపడుతున్న అయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. ఆయనకు అల్జీమర్స్ వ్యాధికూడా ఉంది. వాజ్ పేయి కేబినెట్‌లో రక్షణ శాఖ మంత్రిగా ఫెర్నాండేజ్ దేశానికి సేవలు చేశారు. 1998 నుంచి 2004 వరకు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. రైల్వే శాఖ, పరిశ్రమల శాఖల్లో పనిచేశారు. ఆనారోగ్యం కారణంగా కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
1930 జూన్ 3న కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన జార్జ్ మాథ్యూ ఫెర్నాండెజ్, ప్రజాపోరాట యోధుడిగా గుర్తింపు పొందారు. 1967 నుంచి 2004 వరకు 8 సార్లు లోక్ సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆగష్టు 2009 నుంచి జులై 2010 వరకు ఆయన రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.
తొలుత జనతా పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్న ఫెర్నాండెజ్, అనంతరం 1994లో సమతా పార్టీని ప్రారంభించారు. అయితే, తర్వాతి కాలంలో దానిని జనతా పార్టీలో విలీనం చేశారు. ఆయన మృతికి ప్రధానితోపాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.