పారిశ్రామికవేత్త జయరామ్ హత్య జరిగి నాలుగు రోజులు కావస్తున్న ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేకపోయ్యారు విజయవాడ పోలీసులు. అయితే ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్యకేసులో రోజుకో ఓ పేరు వినిపిస్తోంది. తొలుత ఈ హత్యను జయరామ్ మేనకొడలు శిఖా చౌదరి చేసిందని భావించినప్పటికి ఇందులో ఆమె పాత్ర చాలా చిన్నదని తెలుస్తోంది.
తరువాత ఈ హత్య కేసులో రాకేష్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడు. ఈ రాకేష్ రెడ్డి మరెవ్వరో కాదు జయరామ్ మేనకొడలు శిఖా చౌదరి ప్రియుడు. ఇతనితతో కొంతకాలం డేటింగ్ చేసింది శిఖా చౌదరి. తరువాత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో వీరు విడిపోయినట్లు పోలిసులకు తెలిపిందిశిఖా చౌదరి. రాకేష్ రెడ్డి , జయరామ్‌ల మధ్య ఆర్థికలావాదేవిలే ఈ హత్యకు కారణం అని తెలుస్తోంది. రాకేష్ రెడ్డి నుంచి నాలుగున్నర కోట్లు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతోనే ఈ హత్య చేసినట్లు రాకేష్ రెడ్డి పోలీసుల ఎదుట చెప్పడని సమాచారం. అయితే జయరామ్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేసుకున్న రాకేష్ రెడ్డి అతనిని ఓ హోటల్‌కు పిలిచేందుకు తెలుగు ప్రముఖ యాంకన్‌ను ఎరగా వేశాడని తెలుస్తోంది.
జయరామ్‌కు అమ్మాయిల పిచ్చి ఉండంటంతో ఓ ప్రముఖ తెలుగు యాంకర్‌తో ఫోన్ చేయించి జయరామ్‌ను హోటల్‌కు వచ్చేలా పథకం వేశాడు రాకేష్ రెడ్డి. యాంకర్ ఫోన్ చేసిందనుకుని , ఇవి ఏమి తెలియని జయరామ్ హోటల్‌కు వెళ్లాడు. ఇక పథకం ప్రకారం జయరామ్‌కు విషపు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశాడు రాకేష్ రెడ్డి. ఆ తరువాత మృతదేహాన్ని విజయవాడ దగ్గరలోని ఐతవరం గ్రామం దగ్గర వదిలి పెట్టి వెళ్లాడు. ఇక జయరామ్‌కు తన మేనకోడలు శిఖా చౌదరితో కూడా శారీరక సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె చాలామందితో సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆమెకు గతంలోనే రెండు పెళ్లిళ్లు చేసుకుని వారికి విడాకులు ఇచ్చినట్లు సమాచారం. జయరామ్ హత్యపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ