- Advertisement -
ఏపీ ఎన్నికల సంగ్రామం ముగిసింది. దేశంలోనే ఏ రాష్ట్రంలో నమోదుకాని విధంగా ఏపీలో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత విడుదలైన సర్వేల్లో వైసీపీదే హవా అని తెలుస్తోంది.
పోలింగ్ తర్వాత వెల్లడైన కొన్ని సర్వేల్లో ఏపీలో గెలిచేది జగనే అని తేల్చిచెబుతున్నాయి. తాజాగా ఫోరెన్సిక్ ఎలక్షన్స్ సర్వేలో జగన్‌దే గెలుపు అని స్పష్టమైంది. జగన్ రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని, వైసీపీ 112 నుండి 143 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించింది. అలాగే ఎన్డీఏ కూటమి 32 నుండి 63 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించింది.