- Advertisement -

గ్యాస్ సిలిండర్ ఇస్తే..నెల మొత్తం ఫ్రీ ఫుడ్!

- Advertisement -

ఇటీవల గ్యాస్ సంక్షోభం కారణంగా పలుచోట్ల హోటళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ, అశ్వారావుపేటలోని ఓ హోటల్ యజమాని వినూత్న ఆలోచనతో ముందుకొచ్చాడు. ఓ హోటల్ యజమాని, “గ్యాస్ సిలిండర్ ఇస్తే నెలరోజులు ఫ్రీ టిఫిన్” అనే బంపర్ ఆఫర్ ప్రకటించాడు.

తన హోటల్ ముందు ప్రత్యేకంగా బ్యానర్ కట్టి ఈ ఆఫర్‌ను ప్రకటించడంతో, ఇది స్థానికంగా పెద్ద చర్చగా మారింది. ఇటీవల గ్యాస్ సరఫరాలో అంతరాయం కారణంగా చిన్న హోటళ్లు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.

వంటకు గ్యాస్ అందుబాటులో లేకపోవడం ,ధరలు పెరగడం,వ్యాపారం నష్టపోవడం వంటి సమస్యల నేపథ్యంలో చాలాచోట్ల హోటళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో తన హోటల్ కొనసాగించేందుకు యజమాని ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది.

గ్యాస్ సిలిండర్ అందించిన వారికి నెలరోజుల పాటు ఉచితంగా టిఫిన్ అందిస్తానని చెప్పడం విశేషం. ఈ ఆఫర్ గురించి తెలిసిన స్థానికులు ఆసక్తిగా స్పందిస్తున్నారు. కొందరు దీన్ని క్రియేటివ్ ఐడియాగా ప్రశంసిస్తుండగా, మరికొందరు వ్యాపారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంగా భావిస్తున్నారు. మొత్తంగా గ్యాస్ సంక్షోభం మధ్యలో అశ్వారావుపేట హోటల్ యజమాని చేసిన ఈ వినూత్న ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -