కొన్ని రోజులుగా భారతదేశంలో నాలుగు విషయాలు హల్‌చల్ చేస్తున్నాయి. దేశాన్ని ఒక కుదుపు కుదిపేస్తున్నాయి. ఈ అంశాలన్నీ సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా ఉన్న విషయాలే. ఈ విషయాలన్నీ ప్రజలకు అమితాసక్తి కలిగిస్తున్నాయి. ట్వీట్టర్, ఫేసుబుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ విషయాలు అందర్నీ షాక్‌కు గురి చేస్తున్నాయి.
అయితే ఆ విషయాలన్నీ ‘పీ’ అక్షరంతో ప్రారంభమవుతున్నాయి. అవే ‘పద్మావత్’, ‘పకోడీ’, ‘ప్రియా ప్రకాశ్ వారియర్’, ‘పీఎన్‌బీ బ్యాంకు’ ఉన్నాయి. ఎందుకంటే ఈ నాలుగు విషయాలు దేశవ్యాప్తంగా రచ్చ చేశాయి.
పద్మావత్: గతంలో పద్మావత్ సినిమాపై ఓ మూడు నెలలు రచ్చ అయ్యింది. హింసాత్మక ఘటనలు జరిగాయి. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపిక పదుకునే, షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్ ముఖ్యపాత్రల్లో సినిమా వచ్చి బాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో సినిమా బాగా ఆడింది.
పకోడ: ఆ తర్వాత రాజకీయాల్లో ‘పకోడీ’ ముచ్చట హాట్ టాపిక్‌గా మారింది. పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఖాళీగా ఉండే బదులు ప్రతిపక్షాలు పకోడీలు అమ్ముకోండి అని సలహా ఇవ్వడం.. రాజకీయాల్లో ఇది చర్చనీయాంశమైంది. పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగం అనడం కేంద్ర ప్రభుత్వం చేతగానితనమని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి.
ప్రియా వారియర్: ఒర అదర్ లవ్ సినిమా టీజర్‌తో కన్ను గొడుతూ ఒక్కసారిగా సంచలనంగా మారింది ప్రియా వారియర్. ఆమె కన్ను కొట్టడంతో దేశవ్యాప్తంగా ట్రెండింగ్ మారి దీనికి అనేక ఫన్నీ వీడియోలు వచ్చాయి. ఆమె కను సైగలలో దేశం మునిగిపోయింది.
పీఎన్‌బీ: ఇక దేశం వదిలి విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీ ముచ్చట పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించింది. ఆయన రూ.11,300 కోట్ల కుంభకోణం జరగడం దేశాన్ని కుదిపేస్తోంది. అతడికి కేంద్ర ప్రభుత్వం సహకరించిందని చెప్పడం.. విచారణ నామ్‌కే వాస్తేగా జరగడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై పలువురు ‘బ్యాంకుల్లో ఫారాలు నింపేందుకు ఉంచే రూ.2 పెన్నును తాడుతో గట్టిగా బిగించి కాపాడుకుంటారు. ఇంతలా జాగ్రత్తపడే బ్యాంకులు ఎందుకు మోసపోతున్నాయి అని ప్రశ్నిస్తున్నారు.