Friday, April 19, 2024
- Advertisement -

ప్రియా ప్రకాశ్… ఫన్నీ వీడియో చూస్తే పగలబడి నవ్వుతారు!

- Advertisement -

మన దేశాన్నే కాదు.. ప్రపంచాన్నే ఒక్కసారి తన కన్నుకొట్టి కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వరియర్. చిన్న పెద్దా ఈ బ్యూటీకి ఫిదా అయ్యారు. ఏ స్టార్ హీరోయిన్ కి రాని క్రేజ్ ఈ అమ్మడికి వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో ఛాన్స్ వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ మద్య వరుసగా అన్ని భాషా చిత్రాలకు సై అంటుంది ప్రియా వారియర్.

తాజాగా నితిన్ హీరోగా నటిస్తున్న ‘చెక్’ సినిమాలో నటిస్తూ, టాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసి, తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోంది. ఈ సినిమా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కగా, షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ను ఆమె అభిమానులతో షేర్ చేసుకుంది. సాధారణంగా షూటింగ్ సమయాల్లో ప్రమాదాలు చోటు చేసుకోవడం సహజం.. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం కడుపుబ్బా నవ్వుకుంటారు.

షూటింగ్ లో భాగంగా, నితిన్ నడుస్తూ రాగా, వెనుక నుంచి పరిగెత్తుకుని వచ్చే ప్రియా ప్రకాశ్, ఎగిరి, వీపుపైకి ఎక్కాల్సి వుంది. ఈ సన్నివేశాన్ని షూట్ చేస్తున్న సమయంలో పట్టుతప్పిన ప్రియ, వెల్లకిలా నేలపై పడిపోయింది.  వెంటనే దగ్గర ఉన్న టీమ్ ప్రియా వారియర్ ని లేపారు.. తనకు ఏమీ జరగలేదని చెబుతూ మళ్లీ షూట్ కి రెడీ అంటున్నట్లు కనిపిస్తుంది.

టికెట్ రేట్లు పెంచబోతున్న సినిమాలు…?

విష్ణుకి ‘మోసగాళ్ళు’ కలిసి వస్తుందా…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -