తెలంగాణాలో గ‌ద్ద‌ర్..పవన్ క‌ల‌సి పోటీ ఇది ఫిక్స్‌…

Gaddar Comments On His Friendship With Pawan Kalyan

ప‌వ‌ణ్ క‌ళ్యాన్ ప్ర‌శ్నించ‌డానికే పుట్టిన పార్టీ అనే సిద్దాంతంతో జ‌న‌సేన పార్టీని స్థాపించాడు. 2014 ఎన్నిక‌ల్లో  ఏపీలో బీజేపీ,టీడీపీకూట‌మికి మ‌ద్ద‌తిచ్చిన ప‌వ‌ణ్ ఆత‌ర్వాత జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌తో 2019 ఎన్నిక‌ల్లో  రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.ఇక తెలంగాణాలో మాత్రం గ‌ద్ద‌ర్‌తో క‌ల‌సి పోటీచేస్తాడ‌నే వార్త‌ల‌కు  గ‌ద్ద‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు బ‌లం చేకూరుస్తున్నాయి. పవన్‌కళ్యాణ్‌ నాకు చిరకాల మిత్రుడు.. రాజకీయాల్లో అతనితో పనిచేయాల్సి వస్తే ఆనందమే.. అయితే, ఇప్పుడు ఆ విషయంపై క్లారిటీ ఇవ్వలేను..’ అంటూ అసలు విషయాన్ని చెప్పకనే చెప్పేశారు ప్రజా గాయకుడు గద్దర్‌.

కొత్త రాజకీయ పార్టీ పెట్టి, తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకుంటున్న గద్దర్‌, అతి త్వరలోనే తన రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం.తుపాకిని వ‌దిలి రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు గ‌తంలోనే గద్దర్‌, పవన్‌కళ్యాణ్‌ మధ్య ఇప్పటికే చర్చలు జరిపార‌నీ వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. అయితే అప్ప‌ట్లో ఈ వార్త‌ల‌ను ఖండించిన గ‌ద్ద‌ర్  ఇ మళ్ళీ పవన్‌కళ్యాణ్‌తో తన స్నేహం గురించి చెప్పుకుంటూ కొత్త అనుమానాలకు తెరలేపారాయన.

ప్రస్తుతం కొత్త రాజకీయ పార్టీ పనుల్లో బిజీగా వున్నాననీ, వామపక్షాల నుంచి తనకు సంపూర్ణ మద్దతు లభిస్తుందని చెబుతున్న గద్దర్‌, పవన్‌ నుంచి కూడా మద్దతును ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే గ‌ద్ద‌ర్ వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌ణ్ ఇప్ప‌టి వ‌ర‌కు బ‌హిరంగంగా స్పందించ‌డంలేదు. మొత్తమ్మీద, తెలంగాణలో జనసేన పార్టీకి గద్దర్‌ రూపంలో కొత్త మిత్రుడు దొరికాడన్నమాట. అయితే, ఆ స్నేహాన్ని పవన్‌కళ్యాణ్‌ కొనసాగిస్తారా.? జనసేనతోపాటు గద్దర్‌ పెట్టే పార్టీ 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుందా.? ముఖ్యమంత్రి పీఠమెక్కాలనుకుంటున్న గద్దర్‌ ఆశలు నెరవేరుతాయా.? వేచి చూడాల్సిందే.

Related

  1. మరో సంచలనం.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
  2. రవికిరణ్ ను అరెస్ట్ చేసారు సరే.. మరి వీళ్ల సంగతి ఏంటి బాబులు..?
  3. అబద్దపు కథనాలు ప్రసారం పై ABNకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రవికిరణ్
  4. కర్నూలు లో సంచలనం.. కలెక్టర్ కు చుక్కలు చూపించిన వైసీపీ మహిళ ఎమ్మెల్యే