- Advertisement -

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ వచ్చేసింది!

- Advertisement -

అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ సమ్మర్ సేల్’ (Great Indian Summer Sale) షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. వేసవి వేడిని తట్టుకునేందుకు అవసరమైన ఎలక్ట్రానిక్స్ మరియు గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లతో ఈ సేల్ త్వరలోనే ప్రారంభం కానుంది.

వేసవి సెలవుల సందడి మొదలవుతున్న వేళ, ఆన్‌లైన్ షాపింగ్ ప్రియుల కోసం అమెజాన్ అదిరిపోయే వార్త చెప్పింది. అత్యంత ఆదరణ పొందే ‘గ్రేట్ ఇండియన్ సమ్మర్ సేల్’ తేదీలను ఖరారు చేసింది. మే నెల మధ్యలో ప్రారంభం కానున్న ఈ సేల్‌లో వేలాది ఉత్పత్తులపై మునుపెన్నడూ లేని విధంగా తగ్గింపులు లభించనున్నాయి.

అమెజాన్ సాధారణ వినియోగదారుల కంటే 24 గంటల ముందే ప్రైమ్ మెంబర్లకు (Amazon Prime) ఈ సేల్ అందుబాటులోకి రానుంది. ప్రైమ్ మెంబర్స్.. మే 10వ తేదీ అర్ధరాత్రి నుండి,సాధారణ వినియోగదారులకు మే 11వ తేదీ నుండి సేల్ ప్రారంభం కానుంది.తక్కువ ధరకే వస్తువులను కొనుగోలు చేసేందుకు అమెజాన్ పలు బ్యాంకులతో జతకట్టింది.

SBI & ICICI బ్యాంకుల క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. పాత మొబైల్స్ లేదా ల్యాప్‌టాప్‌ల మార్పిడిపై భారీ ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.బజాజ్ ఫిన్‌సర్వ్ మరియు ప్రముఖ బ్యాంకుల ద్వారా వడ్డీ లేని సులభ వాయిదాల పద్ధతి (No-cost EMI) సదుపాయం కలదు.

ఈ సేల్‌లో ప్రధానంగా వేసవి కాలానికి అవసరమైన ఉత్పత్తులపై అమెజాన్ ఫోకస్ పెట్టింది. ఐఫోన్, శామ్‌సంగ్, వన్‌ప్లస్ మరియు షియోమీ ఫోన్లపై 40% వరకు తగ్గింపు ఉండనుంది.ఎండల తీవ్రత దృష్ట్యా ఇన్వర్టర్ ఏసీలు, విండో ఏసీలు మరియు బ్రాండెడ్ ఎయిర్ కూలర్లపై సగం ధరకు (Up to 50% off) ఆఫర్లు ప్రకటించారు.

విద్యార్థులు మరియు ఉద్యోగుల కోసం గేమింగ్ ల్యాప్‌టాప్స్, ఐప్యాడ్లపై ఆకర్షణీయమైన డీల్స్ ఉన్నాయి.ఎకో డాట్ (Echo Dot), ఫైర్ టీవీ స్టిక్ (Fire TV Stick) మరియు కిండిల్ డివైజెస్ అత్యంత తక్కువ ధరకే లభించనున్నాయి.వస్తువుల ధరలపై నేరుగా తగ్గింపుతో పాటు, కొన్ని ఎంపిక చేసిన ఉత్పత్తులపై ‘కూపన్ల’ ద్వారా అదనపు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. అలాగే ఒకటి కంటే ఎక్కువ వస్తువులను కలిపి కొంటే (Combo offers) ధర మరింత తగ్గుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -