Thursday, May 8, 2025
- Advertisement -

వెనెజువెలా ఎన్నికలలో అఖండ విజయం..!

- Advertisement -

వెనెజువెలా కాంగ్రెస్​కు జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించినట్లు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో రాజకీయ కూటమి ప్రకటించుకుంది. మదురోకు చెందిన యూనైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనుజువెలా సహా కూటమి పార్టీలన్నీ కలిసి ఎన్నికల్లో 67 శాతం ఓట్లు కైవసం చేసుకున్నట్లు తెెలుస్తోంది.

అయితే ఈ ఎన్నికలను ప్రధాన విపక్ష పార్టీలన్నీ బహిష్కరించాయి. ఫలితాలను గుర్తించేది లేదని స్పష్టం చేశాయి. మరోవైపు ఈ ఎన్నికలు మోసపూరితంగా ఉన్నాయని అంతర్జాతీయంగానూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వెనెజువెలా జాతీయ అసెంబ్లీలో.. అమెరికా మద్దతు ఉన్న జువాన్ గువాయిడ్​కు ఇప్పటివరకు ఆధిక్యం ఉంది. కాంగ్రెస్​లో ఉన్న అధికారాన్ని బట్టి గువాయిడే వెనెజువెలా పాలకుడు అని అమెరికా సహా పలు కీలక దేశాలు గుర్తిస్తున్నాయి. అయితే తాజా ఫలితాలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి. మదురో విజయంతో విపక్ష నేతగా ఆయన స్థానం మరింత బలహీనంగా మారే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -