- Advertisement -

ఆరు సెకన్ లలో మీ కార్డ్ హ్యాక్ చేస్తారు

- Advertisement -
Hacked in just six seconds

ప్రస్తుతం ఆన్ లైన్ లావాదేవీల కోసం వీసా – మాస్టర్ కార్డ్ – రూపే – అమెరికన్ ఎక్స్ ప్రెస్ వంటి ప్లాట్ ఫాంలు అందుబాటులో ఉన్నాయి. న్యూ కాస్టెల్ శాస్త్రవేత్తల బృందం వీసా పేమెంట్ సిస్టంపై పరిశోధనలు చేపట్టింది. వివిధ వెబ్ సైట్లలో ఉన్న లొసుగులు – వీసా వ్యవస్థలో ఉన్న భద్రతా లోపాల ఆధారంగా హ్యాకర్లు కేవలం ఆరు సెకండ్లలో డెబిట్ కార్డ్ నంబర్ – వాలిడిటీ – సీవీవీ నంబర్ – సెక్యూరిటీ కోడ్ వంటి వివరాలను సంపాదించే అవకాశం ఉందని తేల్చారు.

తమ పరిశోధనా పత్రాలను యూనివర్సిటీ అకడమిక్ జర్నల్ ఐఈఈఈ సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో ప్రచురించారు. ఈ క్రమంలో పరిశోధకులు రెండు ప్రధాన లోపాలు గుర్తించారు. మొదటిది.. కార్డు వివరాలను పలు వెబ్ సైట్ల నుంచి ఒకేసారి తప్పుగా నమోదు చేసినా గుర్తించడం లేదు. దీంతో హ్యాకర్లకు ఎక్కువ సార్లు ప్రయత్నించడానికి అవకాశం కలుగుతున్నది. రెండోది.. కొన్ని వెబ్ సైట్లు లావాదేవీల కోసం కార్డు నెంబర్ – వాలిడిటీ – సీవీవీ మాత్రమే అడుగుతుండగా – మరికొన్ని ఇతర వివరాలు అడుతున్నాయి.

నేరగాళ్లు వాటిని క్రోడీకరించి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. మాస్టర్ కార్డ్ ప్లాట్ ఫాం ఒకేసారి అనేక సైట్ల నుంచి నుంచి కార్డు వివరాలు నమోదు చేస్తే గుర్తిస్తున్నదని ఈ కార్డులు హ్యాక్ చేయడం కష్టమని చెప్పారు. 3డీ సెక్యూర్ టెక్నాలజీ హ్యాకింగ్ నుంచి కాపాడుతుందని పేర్కొన్నారు. వెరిఫైడ్ బై వీసా – మాస్టర్ కార్డ్ సెక్యూరిటీ కోడ్ – అమెరికన్ ఎక్స్ ప్రెస్ సేఫ్ కీ వంటికి గెస్సింగ్ అండ్ హిట్ నుంచి కాపాడుతాయని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -