పూల్వామా దాడిలో మృతి చెందిన ఓ సీఆర్పీఎఫ్ జవాన్ భార్యకు అత్తింటిలో వేధింపులు మొదలైయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఉగ్రవాదులు జరిపిన దాడిలో మాండ్యాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ హెచ్.గురు మృతి చెందాడు. ఈ ఘటనతో యావత్ భారదేశం మొత్తం విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భారతీయులు అందరు ఇండియన్ ఆర్మీకి మద్దతు తెలిపారు. కాని ఈ జవాన్ ఇంట్లో మాత్రం హెచ్.గురు భార్య కళావతిను వేధింపులకు గురి చేస్తున్నారు. హెచ్.గురు మరణించి 13 కూడా కాకుండానే కళావతికు అత్తింటిలో వేధింపులు మొదలైయ్యాయి. మరదిని పెళ్లి చేసుకోవాలని వారు కళావతిని హింసిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి భారీ ఎత్తున ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సాయం కొట్టేసేందుకు ఇలా మరదిని పెళ్లి చేసుకోవాలని వారు ఆమెను ఒత్తిడి చేస్తున్నారు.చివరికి వేధింపులు హద్దుదాటడంతో ఆమె మాండ్యా పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు కళావతికి ఉద్యోగం కల్పించాలని సంబంధిత అధికారులను కర్ణాటక సీఎం కుమారస్వామి ఆదేశించారు. దేశం కోసం జవాన్ మరణిస్తే, అతని చనిపోయిన తరువాత వచ్చే డబ్బు కోసం ఇలా ఆయన భార్యను వేధించడం చాలా దారుణం అని అంటున్నారు నెటిజన్లు.
- Advertisement -
పూల్వామా దాడిలో జవాన్ మృతి… జవాన్ భార్యకు మరిది వేధింపులు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -