Wednesday, May 22, 2024
- Advertisement -

పాక్ కుట్రను మరో సారి బయటపెట్టిన ఆర్మీ…

- Advertisement -

ఆర్టికల్‌ 370 రద్దు చేయడంతో పాటు జమ్మూకాశ్మీర్‌ నుంచి లడఖ్‌ను వేరు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలగా విభజించింది భాజాపా. దీంతో పాక్ జీర్ణించుకోలేక పోతోంది. భారత్ ను బదనాం చేసేందుకు అన్ని ప్రయత్నాలు విఫలం అవడంతో ఇప్పుడు మరో కొత్త కుట్రలకు పాల్పడుతోంది. బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని లోయలో ముస్లిం ప్రజలు పెద్ద ఎత్తున ప్రార్థనల్లో పాల్గొన్నారు. పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అధికార యంత్రాంగం, భారత సైన్యం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది,

అంతే కాకుండా కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో నిషేధాజ్ఞలను సడలించి. లోయలో బక్రీద్ పండుగా ప్రశాంతంగా జరగడంతో పాక్ కుట్రకు తెరలేపింది. ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్‌పై భారత్‌కు పట్టు దొరుకుతుందని, దాన్ని ఎలాగైనా భగ్నం చేయాలన్న కుట్రతో పాకిస్థాన్ నెటిజన్లు, కొందరు పాక్ అధికార ప్రతినిథులు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టేశారని సమాచారం.

ఆ దేశానికి చెందిన వెరీఫైడ్‌ ట్విటర్‌ అకౌంట్ల నుంచి ఈ దుష్ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో దాయాది కుట్రను భారత సైన్యం బయటపెట్టింది. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్‌లో బందోబస్తు నిర్వహిస్తున్న భారత సైన్యంలో విభేదాలు బయటపడ్డాయని ఓ పాకిస్థానీ నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. వాజ్‌ఎస్‌ ఖాన్‌ (WSK @WajSKhan) అనే వ్యక్తి తన వెరీఫైడ్‌ ట్విటర్‌ ఖాతాలో భారత్‌కు వ్యతిరేకంగా కుట్రపూరిత ప్రచారానికి పునుకున్నాడు.

ఓ గర్భవతిని హాస్పిటల్‌కు తరలించడానికి అనుమతించలేదన్న కారణంగా కాల్పులు చోటుచేసుకున్నాయి. బ్లూ ఆన్ బ్లూ అటాక్. పరిస్థితి అదుపుతప్పిందంటూ’ పోస్ట్ చేశాడు. ఇక అది మొదలు పాకిస్థాన్ నెటిజన్లు దీనిపై రాద్ధాంతం చేయాలని పూనుకున్నారు. అయితే పాక్ పడిన ఈ కుట్ర బట్టబయలయ్యింది.

ఈ ట్వీట్ ను జమ్మూకాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఉద్దేశపూర్వకంగానే దుప్ప్రచారం చేస్తున్నారని, కాశ్మీర్ పోలీసు సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరపడం అనే విషయం పూర్తిగా నిరాధారమని గట్టిగా ఖండించాయి. మేం ధరించే యూనిఫాం రంగులు వేరయినప్పటికీ.. మాకు దేశ భక్తి, గుండెల్లో త్రివర్ణ పతాకం విలువలు నిలిచి ఉంటాయని’ సీఆర్పీఎఫ్ అధికారిక ట్విట్టర్ పేజీలో ట్వీట్ ద్వారా వెల్లడించింది.

కశ్మీర్‌ పోలీసులు కూడా ఈ దుష్ప్రచారంపై స్పందించారు. జమ్మూకాశ్మీర్ పోలీస్ అధికారి ఇంతియాజ్ హుస్సేన్ సైతం ఆ వదంతులను కొట్టిపారేశారు. ‘చిచ్చు రాజేయడానికి వాళ్లు ఏం ప్రచారం చేస్తున్నారంటూ జమ్మూకాశ్మీర్ పోలీస్ అధికారి ఇంతియాజ్ హుస్సేన్ సైతం ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -