ప్రపంచానికి మేధావులను అందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీల తరహాలో విశాఖపట్టణంలోని ఆంధ్రాయూనివర్సిటీని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఉన్నానని, దీనికి విద్యార్థుల మద్దతు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
ఏయూలో చదువుకుని వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు కూడా ఈ విషయంలో తనకు తోడ్పాటు అందించాలని కోరారు. శనివారం ఏయూలో నిర్వహించిన పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీలు ప్రపంచానికి మేధావులను అందిస్తున్నాయన్నారు. ఆ తరహాలోనే రాష్ట్రంలోని యూనివర్సిటీలను కూడా తయారు చేయాలనే సంకల్పంతో ఉన్నానని అన్నారు.
విద్యార్థుల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పై యూనివర్సిటీలు ప్రవేశాలు కల్పిస్తాయన్నారు. అటువంటి వారందరికీ గుణాత్మక విద్యను అందించడం ద్వారా ప్రపంచ స్థాయి మేధావులుగా వారిని తీర్చిదిద్దుతున్నాయన్నారు. ఇలా ప్రపంచ యూనివర్సిటీ లతో కంపేర్ చెయ్యడం , సింగపూర్ మలేషియా అంటూ డబ్బా కొట్టుకోవడం ఈ బుద్ధి చంద్రబాబు గారు ఇక ఎప్పటికి పోగొట్టుకుంటారు అంటూ అక్కడి జనం నవ్వుకున్నారు. ఎంత సేపూ తానూ చేసింది గోరంత అయితే కొండంత చెప్పుకునే అలవాటు ఉన్న బాబుగారు ఈ విధానం మార్చుకోవాలి.