- Advertisement -
జూన్ నుంచి మొదలయ్యే నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువ(105%) వర్షాలనిస్తాయని కొ IMD అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ద్వారా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నైరుతి రుతుపవనాలు దేశంలో సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో వీస్తాయి. ఇవి అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతం నుండి తేమను తీసుకురాగా ఇవి భారీ వర్షాలకు దారి తీస్తాయి. ఇవి ఆగ్నేయ దిశ నుండి వీచి, భారతదేశం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలకు వర్షం తీసుకువస్తాయి.
రుతుపవనాల సమయంలో ముఖ్యంగా నైరుతి రుతుపవనాల సమయంలో భారీ వర్షాలు కురుస్తాయి. ఇక ఇవాళ ఏపీలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. రానున్న 3 గంటల్లో ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని…ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ.