Saturday, May 10, 2025
- Advertisement -

హైదరాబాద్ కుర్రాడిని అమెరికా లో చంపేశారు

- Advertisement -

చదువు కోసం , ఉద్యోగం అమెరికా వెళుతున్న జీవితాలు అక్కడ గోదావలల్లో పడి ముగుస్తున్నాయి. తాజాగా జరిగిన ఒక ఘటన ఒక కుటుంబం మొత్తాన్నీ విషాదం లో ముంచేసింది. హైదరాబాద్ కి చెందిన పాతికేళ్ళ సంకీర్త్ రెండున్నర సంవత్సరాల క్రితం ఉద్యోగం అంటూ అమెరికా వెళ్ళాడు. టెక్సాస్ లో ఉండే అతను సోమవారం తన రూమ్ లో శవం గా తేలాడు.

ప్రాధమిక దర్యాప్తు లో అతను మర్డర్ కి గురయ్యాడు అని చెప్పారు పోలీసులు. సంకీర్త్ గదిలో సరిగ్గా వారం క్రితం సందీప్ గౌడ్ అనే కుర్రాడు రూమ్ మేట్ గా జేరాడు అనీ అతనీ ఈ హత్య చేసినట్టు చెబుతున్నారు. పోలీసులు అతన్ని విచారణ చేస్తున్నారు. తాజాగా అందుతున్నసమచారం ప్రకారం.. ఈ ఇద్దరూ రూమ్ లో ఘర్షణ పడినట్లుగా చెబుతున్నారు.

ఈ గొడవే హత్యకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఎదిగిన కొడుకు చేతికి అంది వచ్చాడన్న సంతోషంలో ఉన్న సంకీర్త్ తల్లిదండ్రులకు హత్యకు గురైన సమాచారం షాకింగ్ గా మారింది. తమ బిడ్డ హత్యకు గురి కావటంపై వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. హత్య చేసినట్లుగా అనుమానిస్తున్న సందీప్ గౌడ్ వివరాలు బయటకు రావాల్సి ఉంది. అతడే ఈ నేరానికి పాల్పడ్డాడా? అన్న అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -