Tuesday, May 6, 2025
- Advertisement -

ప‌దో త‌ర‌గ‌తి కుర్రాడు 20 మంది సాఫ్ట్‌వేర్ అమ్మాయిల‌ను….!

- Advertisement -

ప‌దో త‌ర‌గ‌తి కూడా చ‌ద‌వ‌ని ఓ కుర్రాడు 20 మందికి పైగా సాఫ్ట్‌వేర్ కంపెనీల‌లో జాబ్ చేస్తున్న అమ్మాయిల‌ను మోసం చేసిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే… నెల్లూరుకి చెందిన జీవన్ కుమార్ 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకుని మానేశాడు.చేడు అలవాట్లకు బానిసైన జీవన్ కుమార్ సాఫ్ట్‌వేర్ కంపెనీల‌లో జాబ్ చేస్తున్న అమ్మాయిల‌ను టార్గెట్ చేసుకుని వారిని మోసం చేయ‌డం మొద‌లు పెట్టాడు.సికింద్రాబాద్ కి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని…ఈ ఏడాది ఫిబ్రవరిలో జీవన్ షాదీ.కామ్ అనే మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో తన వివరాలను పొందుపరిచింది. అందులో రిషి కుమార్ నేలపాటి అనే వ్యక్తి ఆమెకు ఇంట్రస్ట్ గా అనిపించడంతో.. అతనితో పరిచయం పెంచుకుంది. కొద్దిరోజులు ఫోన్లో మాట్లాడుకున్న అనంతరం ఇరువురు వారి ఫోటోలను ఒకరికి మరొకరు పంపించుకున్నారు.

రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. సదరు వ్యక్తి తాను బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో పనిచేస్తున్నానని యువతిని నమ్మించాడు. ఒకరోజు యువతికి ఫోన్ చేసి తన తల్లి ఆరోగ్యం బాగాలేదని డబ్బులు అవసరమని చెప్పాడు. ఆమె వెంటనే తన క్రెడిట్ కార్డ్ డీటైల్స్, ఓటీపీ నెంబర్ అన్నీ అతనికి పంపింది. ఆమె వద్ద నుంచి దాదాపు రూ.2.4లక్షల వరకు కాజేశాడు. డబ్బు తీసుకున్న తర్వాత కలుద్దామని యువతి అడిగిన నాటి నుంచి ఆమెను బ్లాక్ చేసేసాడు. ఫోన్ చేయడం,. మెసేజ్ లకు రిప్లై ఇవ్వడం మానేశాడు. దీంతో మోసపోయానని గుర్తించిన యువతి పోలీసులను ఆశ్రయించింది.నిత్యం కంప్యూటర్ ముందు కూర్చొని సాఫ్ట్ వేర్ అమ్మాయిలకు వల వేసి.. వారి నుంచి డబ్బు గుంజుతాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు 20మంది అమ్మాయలను మోసం చేశాడు. బెంగళూరుకి చెందిన ఓ అమ్మాయి ద‌గ్గ‌రు ఇలానే దాదాపు 10 ల‌క్ష‌లు వ‌సూలు చేసిన‌ట్లు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -