Saturday, May 4, 2024
- Advertisement -

ఇది ఎక్కడి మోసం రా సామీ.. పది రూపాయలకు లక్షల రూపాయలు నొక్కేసాడు..!

- Advertisement -

సిమ్ నెట్​వర్క్​ యాక్టివేషన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితున్ని రాచకొండ సైబర్ క్రైం పొలీసులు అరెస్ట్​ చేశారు. జార్ఖండ్ జాంతారకి చెందిన బీర్బల్ పండిట్​… నెట్​వర్క్ గడువు ముగుస్తుందంటూ జనవరి 17 ఓ మహిళకు సందేశం పంపించాడు. అనంతరం ఫోన్​చేసి క్విక్ సపోర్ట్ యాప్ డౌన్​లోడ్ చేయించిన పండిట్…​ రీ యాక్టివేషన్ కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.10 పంపమనన్నాడు.

బాధితురాలు వెంటనే రూ.10 పంపింది. క్విక్ సపోర్ట్ యాప్ ద్వారా ఓటీపీ కాపీ చేసిన పండిట్​.. ఖాతాలోని 6 లక్షల 40 వేలను స్వాహా చేశాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు.

ఈ శివరాత్రికి ఏమైంది.. రాజన్న కి కుడా నష్టమే..!

కష్టాల్లో ప్రముఖ నటుడు.. ఆర్ధిక సాయం ఎదురుచూపు!

ఆ నలుగురిపై పిడుగు పడింది.. కానీ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -