Saturday, April 27, 2024
- Advertisement -

ఆ ఆరుగురిపేర్లు బ‌య‌ట‌కు మ‌స్తే సినిమా ఇండ‌స్ట్రీ షేక్‌…

- Advertisement -

డ్ర‌గ్స్ దందాతో కొన్ని రోజులుగా టాలీవుడ్ షేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. రోజు ర‌జుకీ కొత్త విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతుండ‌టంతో ఇది ఎంత‌వ‌ర‌కు దారి తీస్తుందోన‌నే భ‌యం టాలీవుడ్‌లో నెల‌కొంది. డ్ర‌గ్స్‌ కేసులో ప్ర‌ధాన నిందుతుడిగా ఉన్న కెల్విన్ విచార‌న‌లో సంచ‌ల‌నం రేకిత్తించే విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

ఇప్ప‌టికే కొంద‌రికి నోటీల‌సు ఇచ్చిన సిట్ రెండో జాబితా కూడా సిద్ధం చేసుకుంటోంది. ఇప్పుడు కెల్విన్ చెప్పిన వివరాలతో మూడో జాబితా కూడా సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. తాజా జాబితాలో గత నాలుగైదేళ్లుగా రాణిస్తున్న యంగ్ హీరోయిన్స్ పేర్లు కూడా ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. వారితో పాటు పలువురు రాజకీయ నాయకుల తనయులు, హై ప్రొఫైల్ ప్రముఖులు, పేజ్ 3 సెలబ్రిటీల పేర్లు వెల్లడైనట్టుగా తెలుస్తోంది.

విచారణ పూర్తి కావ‌డంతో అన్ని నిజాలు వెలికి తీయ‌డానికి మ‌రికొన్ని రోజులు క‌ష్ట‌డీకి కోరే అవ‌కాశం ఉంది. చివిరిరోజు విచార‌న‌లో ఎక్సైజ్ అధికారులు మరో ఆరుగురు కీలక వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వీరి విషయంలో అన్ని కోణాల్లోను దర్యాఫ్తు జరిపి, మరిన్ని అంశాలు నిర్ధారించుకున్న తర్వాత నోటీసులు ఇవ్వనున్నారు.

ప్ర‌ధానంగా ఆరుగురిపేర్లు ప్ర‌ముఖుంగా వినిపిస్తున్నాయి వారి పేర్లు బయటపెడితే ఇండస్ట్రీ షేక్ అవడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇద్దరు ప్రముఖ నిర్మాతల వారసులు జాబితాలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వీరిద్దరితో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు, అతని సోదరుడు, మరో ఫైట్ మాస్టర్ ఉన్నారని ప్రచారం సాగుతోంది.మ‌రో సారి క‌స్ట‌డీకి కెల్విన్‌ను అప్ప‌గిస్తే ఇంకెన్న పేర్లు బ‌ట‌కు వ‌స్తాయేన‌ని బెంబెలెత్తిపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -