పాక్ ఆర్మీచేతిలో బందీ అయిన వింగ్ కమాండర్ అభినందన్ వాఘూ సరిహద్దుకు చేరుకున్నారు. అభినందన్‌కు వైమానిక దళ అధికారులు స్వాగతం పలికారు. దీంతో అక్కడా జయహో అభినందన్ నినాదాలతో వాఘా సరిహద్దు మార్మోగిపోయింది. పాక్ చెర నుంచి విడుదలై అభినందన్ క్షేమంగా రావడంతో జై హింద్, భారత్ మాతాకీ జై నినాదాలతో వాఘా సరిహద్దులో ఆనందోత్సాహలు వెల్లివిరిశాయి. అభినందన్ ను తీసుకొస్తున్న పాక్ కాన్వాయ్ ను చూడగానే అక్కడ భారీ సంఖ్యలో గుమిగూడిన భారతీయులు భారత్ మాతాకీ జై, హిందుస్థాన్ జిందాబాద్, జైహింద్ అని భారీ ఎత్తున నినాదాలు చేశారు. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ అధికారులు చట్టపరమైన అప్పగింత ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఇది ముగిసిన వెంటనే అభినందన్ ను పాకిస్థాన్ అధికారులు భారత్ కు అప్పగించనున్నారు. వెంటనే అభినందన్‌కు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు. వైద్య పరీక్షలన్నీ పూర్తిచేశాక అభినందన్ ఆరోగ్యంగా ఉన్నాడని తేలితే ఆయన్ను ఢిల్లీకి తీసుకెళతారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
- Advertisement -
వాఘా సరిహద్దుకు చేరిన వింగ్ కమాండర్ అభినందన్…
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -