Sunday, May 11, 2025
- Advertisement -

నేరాలు నిర్ధారణ అయితే.. ఇక పోటీకి నో ఛాన్స్..!

- Advertisement -

నేర సంబంధిత కేసులో దోష నిర్ధరణ జరిగి, రెండేళ్లు లేదా అంతకుమించి జైలు శిక్ష పొందిన వారు ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హులేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఒకవేళ ఆ దోష నిర్ధరణపై న్యాయస్థానం నిలుపుదల (స్టే) ఉత్తర్వులు ఇచ్చినట్లయితే పోటీకి అర్హులవుతారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

కేరళకు చెందిన సరితా నాయర్‌కు సౌర విద్యుత్‌ కుంభకోణానికి సంబంధించిన రెండు కేసుల్లో మూడేళ్ల వరకు జైలు శిక్షపడింది. ఈ కారణంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎర్నాకులం, వయనాడ్‌ స్థానాలకు ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించారు. తనకు విధించిన జైలు శిక్ష అమలును అప్పీలేట్‌ కోర్టు నిలుపుదల చేసినందున ఎన్నికల్లో పోటీకి అర్హురాలేనంటూ కేరళ హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

శిక్ష అమలును మాత్రమే సస్పెన్షన్‌లో ఉంచారని, దోషిగా నిర్ధరించటంపై స్టే ఇవ్వలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం రిటర్నింగ్‌ అధికారి తీసుకున్న నిర్ణయం సరైనదేనని ధర్మాసనం తెలిపింది. అయితే, అమేఠీలో నామినేషన్‌ దాఖలు చేస్తూ శిక్ష విషయాన్ని వెల్లడించినా అక్కడి రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించకపోవటాన్ని పిటిషనర్‌ వాదనకు బలం చేకూర్చే అంశంగా భావించలేమని స్పష్టం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -