ఐఏఎఫ్ పైలట్ పాక్ చెరకు చిక్కడంతో భారతీయుల దృష్టిలో అసలు విషయం మరుగున పడిపోయింది. పాక్ యుద్ధ విమానాలు ఎందుకు మన గగనతలంలోకి వచ్చాయి? అంతకు ముందు మనం జరిపిన వైమానిక దాడులు ఎవరిపైన సాగాయి? వాటికి గల కారణాలేంటన్న అంశం ఇప్పుడు మరుగున పడిపోయింది.
కానీ కేంద్రం, ఇండియన్ ఆర్మీ మొత్తం ఆ విషయంపైనే దృష్టి సారించాయి. దానికి అనుగుణంగానే పనిచేస్తున్నాయి. అన్ని మీడియా చానళ్లలో అభినందన్ విడుదల పైన ఫోకస్ చేస్తుండగా.. కేంద్రం ఆ దిశగా ఆలోచిస్తూనే ఉగ్రవాదం పీకమణచడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూనే ఉంది. దీనికి రుజువే నిన్న త్రివిధ దళాలు నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశం.
పాక్ ఎఫ్-16 విమానం కూల్చివేత పై సైన్యం ఆధారాలు ప్రపంచానికి చూపెట్టింది. భారత్ లో పౌరుల రక్షణ భద్రతకు తాము అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నామనీ.. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టేవరకు ఆదేశంతో తమ పోరాటం కొనసాగుతుందని… ఉగ్రవాద శక్తులపై తమ యుద్ధం ఆగదని ఆర్మీ – నేవీ – ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రకటించారు.
ప్రెస్‌మీట్‌లో, పార్లమెంట్‌లో శాంతి వచనాలు పలుకుతున్న పాకిస్థాన్ అధినేతలు.. భారత సైన్యం పైకి మిసైల్స్ ప్రయోగిస్తోందని చెప్పారు. భారత్ తో చర్చలకు సిద్ధమంటూ.. శాంతి సంకేతంగా అభినందన్ వర్దమాన్ ను ఇండియాకు పంపిస్తున్నామని పాకిస్థాన్ ప్రధాని చెప్పడంతో… దానికి కౌంటర్ ఇచ్చారు అధికారులు. శాంతిని కోరుకుంటున్న పాకిస్థాన్ ఫిబ్రవరి 26న భారత ఆర్మీ – సైనిక శిబిరంపై దాడి చేయడానికి ప్రయత్నించిందని చెప్పారు. ఫిబ్రవరి 26 – 27వ తేదీల్లో భారత మిలటరీ బలగాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ … తమ ఎఫ్ 16 ఎయిర్ మిసైల్ ను ప్రయోగించిందన్నారు.
ఇక ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేసిన దాడిలో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైనట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని త్రివిద దళాలుస్పష్టం చేశాయి. తమ పోరాటం పాక్ పైన కాదు.. ఉగ్రవాదం మీద.. అది తమ దేశంలో ఉన్న.. పక్క దేశంలో ఉన్న తమ పోరాటం కొనసాగుతుందని.. వెనక్కి తగ్గేది లేదని మరోసారి దాయాది దేశానికి వార్నింగ్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ.