Saturday, April 27, 2024
- Advertisement -

జనాభా సంఖ్యలో భారత్ టాప్.. ప్రమాదం తప్పదా ?

- Advertisement -

ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో చైనా, భారత్ గట్టిగానే పోటీ పడుతున్నాయి. వాణిజ్య, సాంకేతిక, ఆర్థిక పరంగా ఈ రెండు దేశాలు వేటికవే అన్నట్లుగా దూసుకుపోతున్నాయి. ఇక నిన్న మొన్నటి వరకు కూడా ఈ రెండు దేశాలు జనాభా పరంగా గట్టిగానే పోటీ పడ్డాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత రెండవ స్థానంలో ఇండియా ఉంది.

అయితే తాజాగా ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదికల ప్రకారం.. భారతదేశం 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమించింది. UN ప్రపంచ జనాభా డాష్‌బోర్డ్ ప్రకారం చైనా జనాభా 142.57 కోట్లు. భారత్ లో ప్రస్తుతం చైనా కంటే 29 లక్షల మంది అధికంగా ఉన్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.

మరి ఈ స్థాయిలో జనాభా పెరుగుదల వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మన దేశ జనాభా ప్రతి ఏటా కూడా మెరుగైన వృద్ది రేటు సాధించడం గమనార్హం. జనాభా పెరుగుదల వల్ల ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగాల కొరత, పర్యావరణం పై పెను ప్రభావం, వనరుల వాడకం విపరీతంగా పెరగడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల మనదేశ అభివృద్ది వెనుకడుగు వేసే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి జనాభా నియంత్రణపై ప్రభుత్వాలు చర్య తీసుకొని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -