Thursday, May 8, 2025
- Advertisement -

సాక్షి విషయంలో.. కేంద్రం జోక్యం సాధ్యమా?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేత విషయం.. రోజురోజుకూ వివాదంగా మారుతోంది. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పుబడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, జర్నలిస్టులు కొన్ని రోజులుగా నిరసన చేస్తున్నారు.

కానీ.. తన నిర్ణయం నుంచి వెనక్కి వచ్చే ప్రసక్తే లేదని బాబు సర్కార్.. చేతలతో చూపిస్తోంది. ఈ ఆందోళనలపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా.. తన పని తాను చేసుకుపోతోంది.

ఇదే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తున్నందుకే.. సాక్షిపై బాబు సర్కార్ ఆంక్షలు విధిస్తోందని.. ఆ పార్టీ సీనియర్ నేతలు కామెంట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని.. ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలు మళ్లీ మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే.. కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ.. రాష్ట్ర అధికార పార్టీ టీడీపీకి మిత్రపక్షంమని అందరికీ తెలుసు. అలాంటిది.. వైసీపీ నాయకుల డిమాండ్ కు బీజేపీ స్పందిస్తుందా లేదా అన్నది అనుమానంగా మారింది. చంద్రబాబు నిర్ణయాన్ని బీజేపీ తప్పుబడితే.. అది రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య సంబంధాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే.. ఈ వ్యవహారాన్ని బీజేపీ కూడా చంద్రబాబుకే వదిలేసే అవకాశమే ఉన్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -