నేటిరోజుల్లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగిపోతోంది. ఒక్కసారి మధుమేహం బారిన పడితే దానినుంచి బయటపడడం అంతా తేలికైన విషయం కాదు. నెలసరి టైమ్ లో వచ్చే ఆరోగ్య మార్పులు, గర్భధారణ సమయంలో వచ్చే శారీరక మార్పులు,రోగనిరోధక శక్తి లోపించడం, ఐరన్ లోపం వంటివి కూడా స్త్రీలలో డయాబెటిస్ పెరగడానికి కారణమవుతున్నాయి.
అయితే ప్రకృతి ప్రసాధించిన కొన్నింటితో మధుమేహానికి చెక్ పెట్టవచ్చు. ఇందులో ఒకటి మందార. దీనిని ఉపయోగించి టైప్ 2 డయాబెటిస్‌ను “రివర్స్” చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మందారలో సేంద్రీయ ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు మరియు ఆంథోసైనిన్లు ఉన్నాయి. ఇవి యాంటీహైపెర్టెన్సివ్ మరియు లిపిడ్-తగ్గించే ప్రభావాలను కలిగి ఉన్నాయి.
ఇక మందార టీని తరచుగా సేవించడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని తేలింది. మందార టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు , విటమిన్ సి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సాయపడుతుందనే అభిప్రాయం. ప్రతిరోజూ 1 నుండి 2 కప్పుల వరకు మందార టీని తాగడం ద్వార మంచి ఫలితం ఉంటుందట.
అయితే మందారను మితమైన మోతాదులో తీసుకుంటే చాలా సురక్షితం. ప్రధానంగా రక్తంలో చెక్కర స్థాయిలను ఇది కంట్రోల్ చేసే గుణం కలిగి ఉండటంతో మధుమేహం ఖచ్చితంగా రివర్స్ అవుతుందని చెబుతున్నారు. అయితే దీనిపై ఖచ్చితమైన సమాచారం లేకపోయినా ఫలితం మాత్రం ఉంటుందని చెబుతున్నారు.
అలాగే ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో మధుమేహాన్ని అదుపులో ఉంచవచ్చని తేలింది. మందార ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, ఇది మధుమేహానికి ఏకైక చికిత్సగా ఆధారపడకూడదని గమనించడం చాలా ముఖ్యం.
