మొన్నామధ్య ఏపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించి , చెమటలు పట్టించిన ముద్రగడ పద్మనాభం ఏపీ మినిస్టర్ లు ఇచ్చిన మాట కి సైలెంట్ అయిపోయి దీక్ష విరమించుకున్నారు. ఆయన దీక్షకి కూర్చోవడమే నిరాహార దీక్ష అంటూ ప్రకటించి మరీ కూర్చున్నారు.
మళ్ళీ ఇప్పుడిప్పుడే సీన్ లోకి రెండవ సారి వస్తున్న ముద్రగడ , చంద్రబాబు ని నమ్మను అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. తనకి రావాల్సిన పర్సనల్ విషయాలు ఏవో అందలేదు అనీ అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు అనీ ముద్రగడ మీద కొందరు విశ్లేషకులు విశ్లేషణ చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ముద్రగడ మీద చాలా కోపంతో ఉన్నట్టు తెలుస్తోంది.
జగన్ మోహన్ రెడ్డి ముద్రగడ వెనకాల ఉండి నడిపిస్తున్నారు అనే అనుమానం తో చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ముద్రగడ వెనకాల ఉండే ఒక లేఖని ఏపీ ప్రభుత్వానికి రాయించారు అని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. గతంలో మాదిరి కాకుండా.. ముద్రగడ విషయంలో ఏపీ సర్కారు సీరియస్ గా ఉందని చెబుతున్నారు. ముద్రగడను అడ్డు పెట్టుకొని జగన్ రాజకీయంగా లబ్థి పొందాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేయటం చూస్తుంటే.. ఈసారి ముద్రగడ విషయంలో బాబు సీరియస్ గా ఉంటారన్న మాట బలంగా వినిపిస్తోంది.