Sunday, May 5, 2024
- Advertisement -

ప్ర‌యోగానికి చంద్ర‌యాన్ 2 సిద్దం ….ఫోటోల‌ను విడుద‌ల చేసిన ఇస్రో..

- Advertisement -

అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల్లో ప్ర‌పంచ దేశాల‌తో స‌మానంగా భార‌త్‌కు చెందిన ఇస్రో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే అనేక ప్ర‌యోగాలు చేసి రికార్డు సృష్టించిన ఇస్రో ఇప్పుడు మ‌రో భారీ ప్ర‌యోగానికి సిద్ద‌మ‌వ‌తోంది. చంద్ర‌యాన్ 1 ప్ర‌యేగాన్ని విజ‌య‌వంతం చేసిన ఇస్రో ఇప్పుడు చంద్ర‌యాన్ 2 పై దృష్టిపెట్టింది.

చంద్ర‌యాన్‌-2 ప్ర‌యోగం కోసం ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. బెంగుళూరు శాటిలైట్ ఇంటిగ్రేష‌న్ అండ్ టెస్టింగ్ సెంట‌ర్‌లో చంద్ర‌యాన్‌-2 కు సంబంధించిన ప‌రికరాలు సిద్ధం అవుతున్నాయి. చంద్ర‌యాన్‌-2కు చెందిన ఫోటోల‌ను ఇవాళ ఇస్రో రిలీజ్ చేసింది. జూలై 9 నుంచి 16 మ‌ధ్య చంద్ర‌యాన్‌-2 మిష‌న్‌ను ప్ర‌యోగించ‌నున్నారు.2019 సెప్టెంబ‌ర్ 6న అది చంద్రుడిపై దిగే అవ‌కాశాలు ఉన్నాయి.

Image result for isro-releases-first-pictures-of-chandrayaan-2-at-bengaluru-satellite-integration-and-testing-facility-

ఆర్బిటార్‌, ల్యాండ‌ర్‌(విక్ర‌మ్‌), రోవర్‌(ప్ర‌జ్ఞన‌) మాడ్యూళ్ల‌ను చంద్ర‌యాన్‌2 ద్వారా లాంచ్ చేయ‌నున్నారు. జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ద్వారా ప్ర‌యోగం జ‌రుగుతుంది. ఆర్బిటార్ ప్రొప‌ల్‌ష‌న్ మాడ్యూల్ ద్వారా మూన్ ఆర్బిట్‌లోకి శాటిలైట్ ప్ర‌వేశిస్తుంది. ఆ త‌ర్వాత ఆర్బిటార్ నుంచి ల్యాండ‌ర్ వేరుప‌డుతుంది. చంద్రుడిపైన ఉన్న ద‌క్షిణ ద్రువంలో ల్యాండర్ దిగుతుంది.

చంద్రయాన్-2 ప్రయోగం ద్వారా 11 పేలోడ్స్‌ను కూడా కక్ష్యలోకి తీసుకువెళ్లనున్నారు. ఇందులో భారత్‌కు చెందిన‌ 6, యూరోప్‌కు చెందిన 3, అమెరికాకు చెందిన 2 పేలోడ్స్ ఉంటాయి. ఇస్రో 2009లో చంద్రయాన్-1ను విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -