ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీపై సీబీఐ విచారణకు రెడీనా..? సీబీఐ విచారణ జరిగితే మంత్రి నారాయణ పాత్ర ఏంటో బయటకు వస్తోంది. ప్రముఖ న్యూస్ పత్రిక సాక్షి ఆధారాలను సీబీఐకి ఇచ్చి.. విచారణకు పూర్తిగా సహకరిస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించి తమ మంత్రులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు.
ధైర్యం ఉంటే మా సవాల్‌ను స్వీకరించాలి’ అని ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిన్న అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసిరారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ పై నిన్న జరిగిన ఆ రాష్ట్ర శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చిన ప్రతిపక్షం చర్చకు పట్టుబట్టింది. ప్రశ్నాపత్రాల లీకేజీపై మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన చేసిన అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రతిపక్ష నేత జగన్‌కు మాట్లాడేందుకు చాన్స్ ఇచ్చారు.
అయితే అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి.. చంద్రబాబు, మంత్రులు రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, నారాయణ, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ కూన రవికుమార్, బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజులు అడుగడుగునా అడ్డుతగిలేందుకు వారికీ అవకాశమిచ్చారు. ఆయిన జగన్ సంయమనం కోల్పోలేదు. లీకేజీ వ్యవహారంపై ప్రశ్నాస్త్రాలను సంధిస్తూ.. సీఎం వ్యవహారశైలిపై.. ప్రభుత్వ తీరును కడిగిపారేశారు. వివిధ అంశాల గురించి ఎత్తిచూపుతూ అధికారపక్షాన్ని ఆత్మరక్షణలో పడేశారు జగన్.
{youtube}MUxfqOBADp4{/youtube}