Wednesday, May 7, 2025
- Advertisement -

రెండోసారి వైసీపీదే అధికారం..

- Advertisement -

ఏపీ సీఎం జగన రాష్ట్రంలో తిరుగులేని మెజార్టీతో రెండోసారి అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పుడు ఏనోట విన్నా వైయస్ఆర్‌సీపీ ప్రభంజనమే.ఐదేళ్ళు సుపరిపాలన అందించి మేమంతా సిద్ధం యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్ళిన జననేత సీఎం వైయస్ జగన్‌కు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. రాయలసీమలో బస్సు యాత్రతో పరిస్థితి పూర్తిగామారిపోయింది.

ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. రోడ్ షో ఆద్యంతం జనసంద్రాన్ని తలపిస్తూ సాగుతోంది. దారిపొడవునా మీవెంట నడిచేందుకు మేం సిద్ధమంటూ నినదిస్తున్నారు. సీఎం వైయస్ జగన్ కూడా ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమవుతూ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు.

మరోవైపు టీడీపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. చంద్రబాబు కూడా రాయలసీమ నుంచి ప్రచారం ప్రారంభించినా.. వైయస్ఆర్‌సీపీకి వచ్చినంత రెస్పాన్స్ లేదు.

చంద్రబాబు సభలకు జనం కూడా రాకపోవడంతో.. జాకీలు పెట్టినా లేవలేని పరిస్థితిలో ఉంది. దీనికి తోడు కూటమి నేతల మధ్య కుదరని సయోధ్య, అభ్యర్థుల ఎంపికలో వీడని చిక్కుముడులు కూడా టీడీపీని వెంటాడుతున్నాయి.దీంతో ఆపార్టీ నాయకుల్లోనే ఆందోళన మొదలైంది.

సీఎం వైయస్ జగన్ మేమంతా సిద్దం యాత్రతో ప్రజల్లోకి వచ్చాక.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికలు సమీపించే కొలది వైసీపీ గ్రాఫ్ గణనీయంగా పెరుగుతోంది. ప్రజల్లో సీఎం వైఎస్ జగన్ కు ఉన్న ఆదరణ, పార్టీకి వస్తున్న స్పందన చూస్తుంటే ఎన్నికల నాటికి వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది. ఈసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -