- Advertisement -
జగన్ పై దాడికి సంబంధించి విశాఖ పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తల తిప్పకపోతే మెడపై తీవ్ర గాయమై ప్రమాదం జరిగేదని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చెప్పిన అభిప్రాయాన్నే రిమాండ్ రిపోర్ట్‌లో రాశామన్నారు. జగన్ అభిప్రాయాన్ని యథాతథంగా రిపోర్టులో రాశామని తెలిపారు.
జగన్‌కు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చామన్నారు. విచారణకు జగన్మోహన్‌రెడ్డిని పిలుస్తామని ప్రకటించారు.ఒకవేళ జగన్ విచారణకు హాజరుకాకపోతే అవసరమైతే న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు.. ఈ ఘటనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చి విచారిస్తామని విశాఖ సీపీ తెలిపారు.