Monday, May 5, 2025
- Advertisement -

ప‌వ‌న్ జైలు ఊచ‌లు లెక్కించాల్సిందేనా…?

- Advertisement -

ప‌వ‌న్‌పై శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌ను పలు మీడియా సంస్థలు పదేపదే ప్రసారం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయిన పవన్ మీడియాపై ఏకంగా వ్యతిరేఖ ఉద్యమాన్ని చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే . మనలని,మన తల్లులుని, ఆడపడుచులుని తిట్టే పేపర్లు ఎందుకు చదవాలి? వాళ్ళ టీవీలు ఎందుకు చూడాలి?? అంటూ ట్వీటు చేసి ప్రజలను ప్రభావితం చేశాడు. ఆ ఛాన‌ల్ల‌ను బ‌హిస్క‌రించాల‌ని కూడా అభిమానుల‌కు పిలుపునిచ్చారు.

కొన్ని న్యూస్‌ చానళ్ల విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా పవన్‌ ప్రవర్తించారంటూ జర్నలిస్టు సంఘాల నాయకులు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. చానళ్లలో ప్రసారం కానీ వీడియోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేసి అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఈ అంశంపై విచారణ చేపట్టి పలు ఆధారాలు సేకరించారు. ఎలక్ట్రానిక్‌ ఎవిడెన్స్‌ను పవన్‌ ట్యాంపరింగ్‌ చేసినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పవన్‌ కల్యాణ్‌పై ఐపీసీ 469, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

వీడియోలను మార్చి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఒకవేళ ఇది నిజమని తేలితే పవన్ ఊచలు లెక్కపట్టాల్సిందే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మ‌రి ఇది ఎలాంటి ప‌రిణ‌మాల‌కు దారితీస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -