ఎన్టీఆర్ వర్సెస్ విజయ్..బాక్సాఫీస్ వార్!

2026 సంక్రాంతి రేసు ఆసక్తికరంగా ఉండనుంది. మామూలుగా సంక్రాంతి సినిమాలంటేనే భారీ హైప్ ఉంటుంది. ఈ హైప్‌కి తోడు అగ్రహీరోల సినిమాలు వస్తే ఫ్యాన్స్‌ మధ్య యుద్ధం జరగడం గ్యారెంటీ. అలాంటిది ఈ సంక్రాంతి కూడా రేంజ్‌లో ఉండబోతోంది.

ఎందుకంటే యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌తో దళపతి విజయ్‌ తలపడనున్నారు. ప్రస్తుతం దేవర సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌ సినిమాపై దృష్టి పెట్టనున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 6న రిలీజ్ కానుంది.

అలాగే తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటిస్తున్న జన నాయకన్‌ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. ‘జన నాయకన్ కూడా 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఇది విజయ్ కెరీర్‌లో చివరి సినిమా కావడంతో భారీ హైప్‌ క్రియేట్ అయింది. దీంతో ఈసారి బాక్సాఫీస్ వద్ద పోరు ఆసక్తికరంగానే కాదు ఇంట్రెస్టింగ్‌గా మారింది.