Friday, May 9, 2025
- Advertisement -

గోదావరి పుస్క‌రాల తొక్కిస‌లాట ఘ‌ట‌న క‌మిష‌న్ నివేదిక బ‌య‌ట‌కు .. త‌ప్పెవ‌రిదంటే..?

- Advertisement -

2015, జూలైలో జ‌రిగిన గోదావ‌రి పుస్క‌రాల తొక్కిస‌లాటలో 36 మంది దుర్మరణం చెందిన ఘటనకు సంబంధించి సోమ‌యాజుల క‌మిష‌న్ నివేదిక బ‌య‌ట‌కు వ‌చ్చింది. నివేదికను బుధవారం నాడు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. తొక్కిసలాటకు సీఎం కారణం కాదని కమిషన్ ఈ నివేదిక అభిప్రాయపడింది.

హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలో నియమించిన ఏకసభ్య కమిషన్ తన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. అసెంబ్లీ చివరిరోజు సమావేశాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఈ నివేదికను శాసనసభ ముందు ఉంచింది.

కమిషన్ సమర్పించిన 17 పేజీల నివేదికలో.. అతి ప్రచారం కారణంగానే రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుందని తెలిపింది. పుష్కర సమయంపై మీడియాలో జరిగిన విస్తృత ప్రచారం కారణంగానే భక్తులు ఒక్కసారిగా ఘాట్ వద్దకు పోటెత్తారనీ, దీంతో తొక్కిసలాట జరిగిందని వెల్లడించింది. పత్రికలు, టీవీ ఛానెళ్లు ప్రజల్లో గుడ్డి నమ్మకాన్ని కలిగించడంతో పాటు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాయని పేర్కొంది.

ఈ ఘటనపై ఆనాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. గోదావరి పుష్కరాల తొక్కిసలాటకు చంద్రబాబునాయుడే కారణంగా విమర్శలు గుప్పించారు. ఆనాడు చోటు చేసుకొన్న పరిణామాలపై ప్రత్యక్షసాక్షులు అధికారులను విచారించింది. మరో వైపు టెక్నాలజీ సహాయాన్ని కూడ తీసుకొని ఈ ఘటనపై నివేదికను అందించింది.

ఒకే ముహుర్తానికి స్నానం చేయాలనే పిచ్చి నమ్మకం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని సోమయాజులు కమిషన్ అభిప్రాయపడింది. పుష్కరఘాట్ వెడల్పు కూడ 300 మీటర్లు మాత్రమే ఉన్న విషయాన్ని ఆయన తన నివేదికలో ప్రస్తావించారు. మరోవైపు చంద్రబాబునాయుడు పుష్కరఘాట్ నుండి వెళ్లిపోయిన తర్వాతే ఈ ప్రమాదం చోటు చేసుకొందని సోమయాజులు కమిషన్ నివేదికలో స్పష్టం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -