Sunday, May 11, 2025
- Advertisement -

ఇక‌నుంచి అక్క‌డ‌…డ్ర‌స్ కోడ్ త‌ప్ప‌దా….?

- Advertisement -

యూత్‌లో చాలామంది ఒక్కసారైనా బీచ్‌కి వెళ్లాలని కోరుకుంటారు. అందులో చాలామంది బికినీల్లో కనిపించే అందమైన అమ్మాయిల అందాలను తనివితీరా ఆస్వాదించాలనే తాపత్రయంతోనే బీచ్‌కు వెళతారు. అలాంటి బీచ్‌లు మ‌న దేశంలో చాలానా ఉన్నాయి. అయితే విదేశాల్లో మాదిరి కాకుండా ఇక్క‌డ బీచ్‌ల‌ల్లో కొంత మ‌ర్యాద పాటిస్తారు.

బీచ్‌లో అందమైన అమ్మాయిల అందాలను తనివితీరా ఆస్వాదించాలనే కోరిక‌లుంటే ఇక నుంచి ప‌క్క‌న పెట్టేయ‌డ‌మే. ఎందుకంటే బికినీ సోకులను బీచ్‌లకు వెళ్లాలనుకునేవారికి నిరాశ తప్పక పోవచ్చు. బీచ్‌ల్లో కూడా డ్రెస్ కోడ్ తప్పనిసరి చేయాలని కోరుతూ కర్ణాటక స్టేట్ వుమెన్స్ ప్యానెల్ ప్రభుత్వాన్ని కోరింది.

కర్ణాటకలోని గోర్ఖానా బీచ్‌లో కడలి అందాలను ఆస్వాదించేందుకు వెళ్లిన మహిళలకు ఓ వ్యక్తి… పూర్తి న్యూడ్‌గా ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. దీంతో బీచ్‌లో డ్రెస్ కోడ్ పెట్టాల్సిందే అని కోరుతున్నారు మహిళా సంఘాల వాళ్లు.విదేశాల్లో చాలా బీచ్‌ల్లో న్యూడ్‌గా తిరగడం, పడుకోవడం, రిలాక్స్ అవ్వడం వంటివి కామన్. భారతదేశంలోని కొన్ని బీచ్‌ల్లో కూడా ఇలాంటి సదుపాయాలు ఉన్నాయి. అయితే విదేశీయులకు మాత్రమే ఇక్కడ న్యూడ్ బీచ్‌ల్లోకి అనుమతి ఉంటుంది. ఈ విషయాలపై పెద్దగా అవగాహన లేని విదేశీ పర్యాటకులు అన్ని బీచ్‌ల్లో స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటారు.

కర్ణాటక స్టేట్ వుమెన్స్ కమిషన్ ఛైర్‌పర్సన్ ఎన్‌జీ నాగలక్ష్మీ భాయి… ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామికి ఈ విషయం గురించి లేఖ కూడా రాశారు. ‘బీచ్‌లో నగ్నంగా, అర్థనగ్నంగా తిరిగే మగాళ్ల వల్ల అమ్మాయిలకు రక్షణ కరువు అవుతుంది… అమ్మాయిల ముందు ఇలాంటి ఫోజులు ఇవ్వడం వారిని వేధించినట్టే’ అంటూ ఈ లేఖలో పేర్కొన్నారు. ఆలేఖ‌పై ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -