Wednesday, May 7, 2025
- Advertisement -

క‌రుణానిధికి త‌మిళ సినీప్ర‌ముఖులు నివాళులు..

- Advertisement -

త‌మిళ‌నాడు ప్రియ‌త‌మ నేత కరుణానిధి మృతి ప‌ట్ల త‌మిళ సినీ పరిశ్ర‌మ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. కోలీవుడ్‌కి చెందిన టాప్ స్టార్స్ ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్, విశాల్ అజిత్ ,ధనుష్‌, సూర్య త‌దిత‌రులు రాజాజీహాల్‌లో ఉన్న కరుణానిధి పార్ధివదేహాంపై పుష్ప‌గుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. ఎంకే స్టాలిన్, కనిమొళితో పాటు కరుణానిధి కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. కరుణానిధి మృతికి సంతాపంగా సినిమా షూటింగ్‌ల‌తో పాటు థియేట‌ర్స్ అన్ని మూత‌ప‌డ్డాయి. ‘నా కళైంజ్ఞర్‌ను కోల్పోయాను. ఈ రోజును అస్సలు మరిచిపోను. నా జీవితంలో ఇది బ్లాక్ డే అంటూ ర‌జనీకాంత్ భావోద్వేగంతో మాట్లాడిన సంగ‌తి తెలిసిందే.

డీఎంకే అధినేత కరుణానిధి మృతి పట్ల ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కజఘంను ముందుకు తీసుకెళ్లడంలో, దాన్ని పరిరక్షించడంలో అన్నాదురైకి తోడుగా ఇద్దరు సోదరులు కరుణానిధి, ఎంజీఆర్ ఉండేవారని… ఇప్పుడు వారి ముగ్గురిని ఒకే దగ్గర చూడటం సంతోషమని కమల్ ట్వీట్ చేశారు. కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. తమిళనాడుకు ఆయన లేని లోటును పూడ్చడం చాలా కష్టమని చెప్పారు. ఈ రోజు సాయంత్రం 4గం.ల‌కి కరుణానిధి అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -