Sunday, May 12, 2024
- Advertisement -

కాజ‌ల్ అగ‌ర్వాల్ వ‌య‌స్సు ఎంతో తెలుసా..?

- Advertisement -

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో కాజ‌ల్ కూడా ఒక‌రు. లక్ష్మీ క‌ల్యాణం సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచియం అయింది కాజ‌ల్‌. రామ్ చ‌ర‌ణ్‌- రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మ‌గ‌ధీర సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. మ‌హేశ్‌, ప‌వ‌న్‌, ఎన్టీఆర్ బ‌న్ని వంటి స్టార్ హీరోల‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి వంటి సీనియ‌ర్ హీరోతో కూడా న‌టించి మెప్పించింది. ఇదే స‌మ‌యంలో కోలీవుడ్‌లో కూడా త‌న స‌త్తాను చాటింది. తాజాగా ఈ భామ ఓ అవార్డు ఫంక్ష‌న్‌లో మాట్లాడుతు త‌న వ‌య‌స్సును దాచుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపింది. నా వ‌య‌స్సు ఇప్ప‌టికి 10 సంవ‌త్స‌రాలే అని తెలిపి అక్క‌డ ఉన్న వారికి షాక్ ఇచ్చింది.

అవును నా వ‌య‌స్సు 10 సంవ‌త్స‌రాలు ఎలా అంటే… నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 10 సంవ‌త్స‌రాలే, అందుకే నా వ‌య‌స్సు 10 సంవ‌త్స‌రాలే అంటుంది కాజ‌ల్. ఈ ప‌ది సంవ‌త్స‌రాల‌లో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల‌లో మొత్తం క‌లిపి 50 సినిమాలు చేసింది కాజ‌ల్‌. ప‌ది సంవ‌త్స‌రాల‌పాటు అందం, క్రేజ్‌ను కాపాడుకోవ‌డం అంటే మాములు విష‌యం కాదు. కాజ‌ల్ ప్ర‌స్తుతం తేజ ద‌ర్శ‌క‌త్వంలో సీత అనే సినిమాలో న‌టిస్తుంది. ఈ సినిమాలో బెల్ల‌కొండ శ్రీనివాస్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు త‌మిళంలో క‌మ‌ల్‌హాస‌న్ భార‌తీయుడు -2లో హీరోయిన్‌గా న‌టిస్తుంది కాజ‌ల్‌. ఇన్ని సంవ‌త్స‌రాలలో ఎన్ని సినిమాల‌లో న‌టించిన న‌టిగా త‌న వ‌య‌స్సు చాలా చిన్న‌దేన‌ని చెబుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -