Friday, May 9, 2025
- Advertisement -

కవిత నోట.. జై ఆంధ్రా మాట

- Advertisement -

కొన్నిసార్లు.. కొందరు.. కొన్ని మాటలు చెబితే.. వినడానికి ఎంతో ఆశ్చర్యంగానూ.. ఒక్కోసారి ఆనందంగానూ అనిపిస్తుంటుంది. అమెరికాలో ఆటా వేడుకల్లో.. తెలంగాణకు చెందిన నిజామాబాద్ ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత మాటలు చూస్తుంటే.. ఇదే ఫీలింగ్ కలుగుతోంది. ఎప్పుడూ ఎనర్జిటిక్ గా మాట్లాడే కవిత.. ఎన్నడూ ఆంధ్రాకు మద్దతుగా మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ.. ఈ సారి మాత్రం తన తీరు మార్చుకుని.. అందరి అటెన్షన్ ను తన వైపు తిప్పుకున్నారామె.

తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు త్వరగా అనుమతులు ఇస్తున్నామంటూ.. తన రాష్ట్రం గురించి ప్రసంగంలో మాట్లాడిన ఎంపీ కవిత.. చివరికి రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వారిగా కలిసే ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా.. ప్రసంగం ముగించే సమయంలో.. జై తెలంగాణతో పాటు.. జై ఆంధ్రా అని కూడా అన్నారు.

కవిత కావాలనే అలా అన్నారో.. లేక మనసులో ఉన్న మాటే చెప్పారో తెలియదు కానీ.. ఆమె నోటి వెంట జై ఆంధ్రా అన్న మాట విన్నవాళ్లు.. కొందరు స్వాగతించారు. మరికొందరు మాత్రం.. ఆశ్చర్యపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -