ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి.అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల్లోనే ప్రజలల్లో బాబు గ్రాఫ్ పడిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ విమర్శలు చేసింది ఎవరో కాదు సాక్షాత్తు టీడీపీ మిత్ర పక్షం భాజాపా.అందుకే ఇచ్చే ఎన్నికల్లో పచ్చపార్టీతో పొత్తు వద్దని కుండబద్దలు కొడుతున్నారు.
{loadmodule mod_custom,Side Ad 1}
టీడీపీ తీరుపై అమిత్ షాకు తాము ఫిర్యాదు చేశామని నేరుగా చెప్పారు కమలం నాయకులు. టీడీపీ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. గత ప్రభుత్వ అవినీతి కంటే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి ఎన్నో రెట్లు పెరిగిందని ఈ విషయాన్ని గతంలోనూ తాను చెప్పానన్నారు. ప్రభుత్వం మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని అదే విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామన్నారు. టీడీపీ అవినీతి కారణంగా బీజేపీ తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేకుండా పోయిందని పార్టీ చీఫ్ దగ్గర తమ గోడును వెల్లబోసుకున్నారు.
జన్మభూమి కమిటీల ద్వారా కేవలం టీడీపీ కార్యకర్తలు మాత్రమే లబ్ది పొందుతున్నారని ఆరోపించారు. టీడీపీ చేస్తున్న ఈ అన్యాయంపైనే పోరాటం చేద్దామని పార్టీ నాయకత్వాన్నికోరామని కావూరి చెప్పారు. చంద్రబాబు పాపులారిటీ పతనమవుతోందని కావూరి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎదుగుదలకు అవకాశం ఉంటుందన్నారు.
{loadmodule mod_custom,Side Ad 2}
ఇదే సంయలో రాష్ట్రంలో బాబు గ్రాప్ పడిపోవడంతోపాటు…జగన్ మైలేజి పెరుగుతోందని భాజాపా నాయకులే సెలవిచ్చారు.ఇసుక అక్రమ రవాణ, రాజధాని, పోలవరం తదితర అంశాల్లో అవినీతిని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం మీద టీడీపీ గ్రాఫ్ పడిపోతోందని కావూరి సాంబశివరావు బహిరంగంగా అది కూడా అమిత్ షాను కలిసి వచ్చిన తర్వాత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read